Botsa Satyanarayana: అమరావతి సచివాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. 62 ఏళ్ళకు పదవీ విరమణ అంశాన్ని గురుకుల టీచర్లు, కార్పొరేషన్లకు కూడా అమలు చేయాలని ఉద్యోగులు కోరారని.. న్యాయపరమైన చిక్కులు లేని సందర్భంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పామని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగులను పిలవలేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమాచారం సీపీఎస్ భేటీగా…
Andhra Pradesh: అమరావతి సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశమైంది. బ్లాక్ 2లో ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి, ఇతర నేతలు సీపీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా…