రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తాను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై బుద్ధదేవ్…