సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు.
CPI Ramakrishna: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు.
పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’ అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారు?చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్టపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు రామకృష్ణ. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. హుజూరాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశ భవిషత్తును పాడుచేసే విధంగా మోడీ పాలన సాగుతోందని, ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని చాడ మండిపడ్డారు. రైతులను బజారు పాలు చేసే చట్టాలు తెచ్చారు, మోడీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని…
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం అధికమైంది. పన్నుల మీద పన్నులు మోపుతున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ.. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల పేద ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించుకుంటే పేదలపై భారం తగ్గుతుంది. నిత్యావసర ధరలు…