కొవిన్ పోర్టల్ డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టి పారేసింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన వార్తలన్నీ నిరాధారమని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాల్సిందిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ)ని కోరినట్లు కేంద్రం తెలిపింది.
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర…