కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. ఈ వైరస్ మనుషులనే కాదు.. మూగ జీవులను వదలడం లేదు. తాజాగా కరోనాతో ఓ సింహం మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. “నీలా” అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. ఈ జూలాజికల్ పార్క్ లో మొత్తం 11 సింహాలు ఉండగా.. 9…
ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 10, 413 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,36,095 కు చేరింది. ఇందులో 15,91,026 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,33,773 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.…
విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా…
భారత్ సొంత టెక్నాలజీతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు తయారు చేసింది. అయితే, అధికమొత్తంలో వ్యాక్సిన ఉత్పత్తి చేసేందుకు కోవాగ్జిన్ సంస్థ ఇండియాలోని మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని హెచ్.బీ.పీ.సీ.ఎల్ సంస్థ రాబోయో 8 నెలల కాలంలో 22 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్టు మహారాష్ట్ర ఫార్మా సంస్థ తెలిసింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి మహా సర్కార్ రూ.93 కోట్లు, కేంద్రం రూ.65 కోట్లు నిధులను…
కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు ఆటా ప్రతినిధులు. ప్రాథమికంగా 50 కాన్సట్రేటర్స్ ను ప్రభుత్వానికి అందించిన ఆటా.. మొత్తం 600 కాన్సట్రేటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో…
కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాలలో ఆన్‌లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామని వివరించారు. Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ పోర్టల్ లో ఆన్‌లైన్…
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు…
తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2524 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 578351 కి చేరింది. ఇందులో 5,40,986 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,084 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం…
కోవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92…
భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,65,553 పాజిటివ్ కేసులు నమోదవగా.. 3,460 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2,76,309 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,25,972 మంది మరణించారు.. ఇక, రికవరీ కేసులు 2,54,54,320 కు పెరిగాయి. ప్రస్తుతం…