ఇండియాలో కరోనా మహమ్మారి భయం ప్రజలను పట్టి పీడిస్తోంది. కొద్దికాలంపాటు డెల్టా వేరియంట్ విజృంభించగా..ప్రస్తుతం ఒమిక్రాన్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే…కొత్త కేసులను అరికట్టేందుకు బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని టీకా తయారీ సంస్థ సీరం…డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసింది. దీనిపై ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ’…