దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నాలుగు నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయి.
జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్‌ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే.
కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్‌లు కేంద్రంగా చికిత్స అందాలి, టెస్టింగ్, మెడికేషన్ విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలి, ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి.. పీహీచ్‌సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్‌లు పని చేయాలి అని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. కోవిడ్ వ్యాప్తి, తాజా పరిణామాలపై వివరించారు అధికారులు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల పని తీరు వంటి వాటి పై…
చైనాలో కరోనా కేసులు ఉల్క వేగంతో పెరుగుతూ ఉన్నాయి. వైరస్ బారిన పడిన ప్రజలు కోకొల్లలుగా మరణం బారిన పడుతున్నారు. ఆ దేశంలోని ఐసీయూల్లో ఆస్పత్రి బెడ్లు పేషంట్లతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి.
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొంతకాలంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే, ఆ ఆంక్షలు కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే…