కరోనా ఎంట్రీ తర్వాత అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది.. ప్రజల జీవితాల్లో మాస్క్ తప్పనిసరి అయిపోయింది.. ఇంటిని నుంచి బయట అడుగు పెడితే మాస్క్ మూతికి ఉండాల్సిందే.. ఇదే సమయంలో ఎన్నో రకాల మాస్క్‌లు ఎంట్రీ ఇచ్చాయి.. కొన్ని కొన్ని గంటల పాటు ధరించి పారవేసేవి కొన్ని అయితే, మరికొన్ని ఒకరోజు.. ఇంకా కొన్ని రోజుల పాటు.. ఇలా వాడుతున్నారు.. ఇక, క్లాత్ మాస్క్‌లు.. రెగ్యులర్‌గా వాష్ చేస్తూ ధరించేవారు చాలా మందే. ఇక, కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఎన్95 మాస్కులకు ప్రత్యేకత ఉంది.. అయితే, వీటి ధర కూడా ఎక్కువే.. కాకపోతే వాటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడంతో నిర్దిష్ట సమయం పాటు వాడి పారేస్తున్నాయి.. కానీ, ఈ ఇబ్బందికి చెక్ పెట్టారు అమెరికా శాస్ట్రవేత్తలు.. ఎన్ 95 మాస్క్‌లు కూడా ఎక్కువ సారు ధరించేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
Read Also: ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్
ఎన్ 95 మాస్క్ కోసం వేపరైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విధానాన్ని తీసుకొచ్చారు అమెరికాలోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు.. దీంతో మాస్క్‌ను శుద్ధి చేయొచ్చు.. దీని సాయంతో శుద్ధి చేసిన ఎన్95 మాస్కులను పాతికసార్లు వాడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. అంతే కాదు పాతికసార్లు వాడినా.. మాస్కు యొక్క పటిష్ఠత, సమర్థత ఏ మాత్రం తగ్గబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఎన్95 మాస్కులను సాధారణంగా ఆస్పత్రుల్లో ఆరోగ్యపరిరక్షణ సిబ్బంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో సాధారణ ప్రజలు కూడా ఈ మాస్క్‌ను వినియోగించడంతో.. అనేక దేశాల్లో వీటికి డిమాండ్ పెరిగి, కొరత కూడా ఏర్పడింది. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.