కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ… థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆంక్షలు మొదలయ్యాయి. కేరళలో నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై కర్నాటకలో క్వారంటైన్ ఆంక్షలు విధించారు. కేరళ నుంచి కర్నాటకకు వస్తే తప్పని సరిగా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇకపోతే,…
దేశంలో కరోనా కేసులు నేడు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 30,941 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,68,880 కి చేరగా ఇందులో 3,19,59,680 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,70,640 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 350 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,38,560 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
టీఎస్ హైకోర్టులో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని సవాలు చేసారు పిటీషనర్. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. అయితే నేడు పిటీషన్ పై…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్ సెప్టెంబర్ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. వైరస్ రోజురోజుకు … రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, అల్ఫా వంటి కొత్త వేరియంట్లతో… ఆయా దేశాల్లో విజృంభిగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ కొత్త వేరియంట్ సీ.1.2ను… ఈ ఏడాది మే నెలలో తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన NICD, KRISPలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్,…
కరోనా కాలంలో అనేక మంది తమ విలువైన ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది రోడ్డున పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త వేరియంట్లతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. కరోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు లేకపోవడంతో పైలెట్‌లను తొలగించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యూకేకు చెందిన ఎరోల్ లెవెంథల్ కూడా ఒకరు. ఈయన ఉద్యోగం కోల్పోయిన తరువాత, పైలెట్ కాకముందు ఉన్న అనుభవంతో తిరిగి లారీ డ్రైవర్‌గా…
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఆరాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఇక, కేరళ సరిహద్దుగా ఉన్న కర్ణాటక కీలక నిర్ణయం తీసుకున్నది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పని సరిగా సంస్థాగతంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలా మహమ్మారిని కట్టడి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. సి 1.2 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాదుల సంస్థ పేర్కొన్నది. ఈ సీ 1.2 ను మొదటగా మే నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. సి 1…
ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్ వేవ్ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియా రిసెర్చ్ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా…
కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.. అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె…