భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,40,225 కు చేరింది.. మరోవైపు..…
కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గక ముందే.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. తిరిగి స్కూళ్లు, విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం… అయితే, అక్కడక్కడ వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది.
దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. తెలంగాణ మినమా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1520 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 1568 కేసులు, కర్ణాటకలో 1220 కేసులు నమోదయ్యాయి. అయితే, కేరళలో మాత్రం ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 29,322 కేసులు నమోదవ్వగా, 131 మరణాలు సంభవించాయి. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీ సంఖ్యలో నమోదవ్వగా, ఇప్పుడు ఆసంఖ్య…
కరోనా ఎంత పనిచేస్తివి.. అందరినీ అసహాయులను చేస్తుంటివి.. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ లో అయితే ఉద్యోగాలు పోయి చాలా మంది తినడానికి తిండిలేని పరిస్థితులు చవిచూశారు. ఇది సామాన్యులకే కాదు.. దేశాన్ని పాలించే ప్రభువులకు కూడా చుట్టుకుందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది. కరోనా ధాటికి ఓ బిగ్ వికెట్ పడిపోయింది. చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1520 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. ఇందులో 19,89,931 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్చ్ కాగా 14,922 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు,…
భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 366 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 34,791 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి…
దేశంలో కరోనా కేసులు ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. ఓనం పండుగ తరువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జరుపుకునే పెద్దపండగలైన వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వాటిపై కరోనా ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉన్నది. పండుగల కోసం ఒక చోట పెద్ద సంఖ్యలో గుమిగూడితే కరోనా…
ఏపీలో కోవిడ్ పరిస్ధితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటుగా వుంది. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు వున్నది. గడచిన మే…