భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 28,591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.. మరో 338 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 34,848 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,36,921కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,24,09,345కి పెరిగాయి.. ఇక,…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా నిలదొక్కుకున్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కరోనా ఎలా వస్తుంది. దాని వలన వచ్చే ఇబ్బందులు ఎంటి? కరోనా అంటే ఎంటి… ఎలా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది… క్వారంటైన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. 11 వ తరగతిలోని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించనునన్నారు. 11 వ తరగతికి…
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పుల నిర్వహణ విషయంలో తప్పుడు దోవలో పయనిస్తున్నాయని ఐరాస జనరల్ సెక్రటరి అంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న దేశాలు 2022 ప్రధమార్థం నాటికి ప్రపంచంలో 70శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ను అందించే లక్ష్యంగా ఉత్పత్తిని పెంచాలని అన్నారు. అయితే, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయలేకపోయామని అన్నారు. ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వాతావణంలో…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,28,795కి చేరింది. ఇందులో 19,99,651 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 15,157 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1090 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందినట్లు…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 33,376 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 308 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 32,198 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,08,330కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,23,74,497 కి పెరిగాయి……
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలతో… పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను… బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ భారీగా పెరింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్ పరీక్షించగా.. 1,608 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,107 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి…
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచన వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రతిపాదన ఎవరు చేశారు? దీనివల్ల సర్కార్‌కు కలిగే ఉపయోగం ఏంటి? చిత్ర పరిశ్రమకు ఎలాంటి మెసేజ్ పంపారు? ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మడంపై చర్చ! సినిమా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్ విధానంలో ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని చూస్తోంది. ప్రభుత్వమే సొంత పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అమ్మాలన్నది నిర్ణయం. ఓ కమిటీని వేసి..…
భారత్‌లో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 34,973 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 260 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 37,681 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,31,74,954 కు పెరగగా.. రికవరీ కేసులు 3,23,42,299కు…