ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావడంతో దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,323 శాంపిల్స్ పరీక్షించగా.. 324 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారిబారినపడి మరొకరు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో.. 280 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6,53,302కు పెరిగింది.. కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,899కు చేరిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. కొత్తగా 1445 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 11 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,243 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, 74, 75, 461…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ 60 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఇండియా వ్యాక్సినేషన్‌లో వరల్డ్ రికార్డ్‌ను సాధించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 75,89,12,277 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ వరకు దేశంలో పురుషులకు 52.5 శాతం, మహిళలకు 47.5శాతం ఇతరులకు 0.02 శాతం డోసులు వేసినట్టుగా కేంద్రం పేర్కొన్నది.…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ డెల్టా వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నది. వ్యాక్సిన్‌పై చాలా మంది చూపిస్తున్న విముఖత కూడా ఇందుకు ఒక కారణం కావొచ్చు. సోమవారం రోజున అమెరికాలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ తీవ్రదశకు చేరుకుందని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 27,176 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,33,16,755కి చేరింది. ఇందులో 3,25,22,171 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 284 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా…
కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కారణంగా పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికి కరోనా భయంతో పిల్లలను ఇంటినుంచే చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉండటంతో పిల్లలు అధిక బరువు పెరుగుతున్నట్టు అమెరికన్ మెడికల్ అసోసియోషన్ జర్నల్ సర్వేలో తేలింది. 5-11 ఏళ్ల వయసున్న పిల్లలు కరోనా కాలంలో బరువు పెరిగినట్టు ఈ సర్వే పేర్కొన్నది. కోవిడ్ కాలంలో 5-11 ఏళ్ల లోపున్న పిల్లలు 2.5…
కరోనా కాలంలో కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకున్నాం. రెండేళ్లుగా చాలా మంది ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నాయి. పిల్లలైతే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చదువుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది ఖైదీలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. అలా విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉంటారు అని గ్యారెంటీ లేదు. అందుకే కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వర్క్‌ఫ్రమ్ హోమ్ మాదిరిగానే జైల్ ఫ్రమ్ హోమ్ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. దీనికి…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఈ ఏడాదే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.. మరోవైపు.. మరోవైపు 18 ఏళ్లకు దిగునవారికి వ్యాక్సినేషన్‌పై ట్రయల్స్ కొనసాగుతున్నాయి.. చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇక, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదనిపై రకరకాల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెలల…