హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లపై సమీక్ష చేశారు.. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌పై ఆరా తీశారు.. ఈ సమావేశంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఏయే జిల్లాల్లో ఏ…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతూనే ఉంది.. కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తగిలింది.. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలంది.. దీంతో పుతిన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు రష్యన్ మీడియా పేర్కొంటోంది. ఇక, కోవిడ్ దెబ్బతో అంతా ఆల్‌లైన్ మయం కాగా.. ఇప్పుడు పుతిన్ కూడా వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాల్లో పాల్గొంటారని క్రెమ్లిన్…
ఒకప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడుకునే వాళ్లు. కానీ కరోనా ఎంట్రీతో ఆ రోజులు పోయినట్లే కన్పిస్తున్నాయి. ఇప్పుడంతా కరోనా ముందు(Before Carona).. కరోనా తర్వాత(After Carona) అని మాట్లాడుకుంటున్నారు. కరోనా ఇప్పట్లో మనల్నీ వదిలిపోయేలా లేదు. ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్ అంటూ మనల్ని భయపడుతూనే ఉంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తనకు దూరంగా ఉంటే మిమల్ని, మన కుటుంబాలను ఏం చేయనంటూ కరోనా అభయమిస్తుంది. ఇదొక్కటే మానవళిని కరోనా…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 25,404 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది. ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. 3,62,207 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 37,127 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌లో పేర్కొన్నది. 24 గంటల్లో కరోనాతో 339 మంది మృతి…
దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే, థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉందన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను వేగం చేయడంతో కరోనా కేసులు నమోదవుతున్నా మరణాల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. థర్డ్ వేవ్ ముప్పుపై బెనారస్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. మూడో వేవ్ ముప్పు మరో మూడు…
వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,974 శాంపిల్స్ పరీక్షించగా 315 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఒకేరోజు 318 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన టెస్ట్‌ల సంఖ్య 2,55,03,276కు చేరగా.. పాజిటివ్ కేసులు 6,61,866కు పెరిగాయి..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. దీనికి ప్రధానం కారణం టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడంగా చెప్పుకోవచ్చు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు.…
భారత్‌లో కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 27,254 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 219 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 37,687 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,64,175 కు పెరగగా.. రికవరీ కేసులు 3,24,47,032కు…
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా మరికొన్ని వేరియంట్లు అక్కడ చైనాలో వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి ఆంక్షలు విధేంచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అయింది. పూజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరంలో 19 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ నగరంలో ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి ఆ నగరాన్ని పూర్తిగా మూసివేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసరంగా ఎవరైనా బయటకు రావాలి అంటే…