భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. మొదటి రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రెండవ రోజు వరంగల్ నగరంలో చరిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భావన సముదాయాన్ని ప్రారభించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి…