Murder Case: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో శుక్రవారం 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు డిఎస్పీ టి.మురళీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసు 2020 డిసెంబరులో గ్రామంలోని రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించింది. గ్రామంలో ఒక వీధి ప్రారంభంలో కొత్తగా నిర్మించిన ఆర్చీకి పేరు నిర్ణయించే క్రమంలో రెండు వర్గాలు ఆందోళనకు…