Andhra Pradesh: దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. Read…