ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులై అర్ధ రాత్రి రోడ్డు పై వెళ్తున్న భార్యాభర్తల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.. తాము భార్యాభర్తలమని చెప్పినా కనికరించలేదు. సంబంధం లేని ప్రశ్నలతో పవిత్ర బందాన్ని అభాసు పాలు చేశారు. ఈ సంఘటన నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.రాజకీయ బలంతో పాటు అంగబలం, అర్థబలం ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులు సామాన్య ప్రజానీకంపై మాత్రం వారి జులుం ప్రదర్శించడం విడ్డూరం. ఖమ్మం జిల్లా…