మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్(35) గురువారం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనంపై తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తుండగా ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఒకరు తల్వార్.. మరొకరు గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చి అక్కడినించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రవినాయక్ మృతదేహాన్ని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. కాగా, హత్యకు పాల్పడ్డ ఇద్దరు అనుమానితులను…