Fake Seeds : నకిలీ విత్తనాల మాఫియా కొత్త పంథాలో అడుగులు వేస్తోంది. పశువుల దాణా పేరుతో నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాలకు పార్సిల్ రూపంలో పంపిస్తున్నారు. అధికారులు ఈ నకిలీ విత్తనాల దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మాఫియా కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కుమరంభీం , మంచిర్యాల జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా ఊపందుకుంది. ఇటీవల పోలీసులు బస్తాల కొద్దీ…
Tummala: ఖరీఫ్ 2024లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షలలో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయశాఖ అంచనా వేయగా, దానికి సరిపడా BGII పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల…