Dokka Manikya Vara Prasad : మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారని, నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు అని ఆయన…
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను తన భర్తే బయటపెట్టాడు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశాడు.
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు కలకలం సృష్టించాయి.. ఇక, తనపై ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారు మంత్రి అనిల్.. ఇసుక దుమారంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు.. మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి మినహా అన్ని పార్టీలు హాజరు కాగా.. రేపు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పరివాహక ప్రాంతంలో అఖిలపక్షం సభ్యులు పర్యటించనున్నారు.. అయితే, అనుమతులు లేకుండా ఇసుకను తరలించిన మాట వాస్తవమేనని అఖిల…