అవినీతి ఆరోపణలు.. సీరియస్‌గా స్పందించిన మంత్రి అనిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు కలకలం సృష్టించాయి.. ఇక, తనపై ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారు మంత్రి అనిల్.. ఇసుక దుమారంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు.. మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి మినహా అన్ని పార్టీలు హాజరు కాగా.. రేపు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పరివాహక ప్రాంతంలో అఖిలపక్షం సభ్యులు పర్యటించనున్నారు.. అయితే, అనుమతులు లేకుండా ఇసుకను తరలించిన మాట వాస్తవమేనని అఖిల పక్ష సభ్యుల చెబుతున్నారు.. కానీ, ఇసుక తరలింపు వ్యవహారంలో మంత్రి అనిల్ పాత్ర ఉందో లేదో మరో 24 గంటల్లో తేలే అవకాశం ఉందంటున్నారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రోజు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు.. స్పందించాల్సిన అవసరం లేదన్నారు.. చెత్త ,చెదరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ఇసుక రీచ్ వద్ద అనవసరంగా రాజకీయ సన్యాసం చేసుకుంటాను అన్నారు కొందరు అని సెటైర్లు వేశారు.
రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇసుక వ్యవహారంలో నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరిన ఆయన.. దిగజారుడు తనంతో నేను బ్రతకలేనన్నారు.. రేపు ఉదయం అన్ని పార్టీలతో పాటు.. మా పార్టీ నుండి కూడా ఇద్దరి పంపిస్తాను.. పని చేస్తే ఆలోచనతో చేయాలి అని హితవుపలికారు.. నేను ఎప్పుడూ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూళు చేయలేదన్న ఆయన.. ఆ మట్టితో ఎవరూ ఇల్లు కట్టుకోలేరన్నారు.. నేను వైఎస్ జగన్ శిష్యరికంలో రాజకీయం చేస్తున్నాను.. రాజకీయాలు చేస్తే మగాడిలా చేస్తాను అన్నారు. నేను అక్రమాలు చేస్తే నన్ను 2024 ఎన్నికల్లు ఓడిస్తారు అన్నారు మంత్రి అనిల్ కుమార్.. వైఎస్సార్ జెండా కోసం ఏమైనా చేస్తానన్న ఆయన.. ప్రతిపక్షం వారు నెల్లూరులో సంచులు తీసుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంచుల వెనుక ఎవరైనా ఉండొచ్చు… లోకేష్ కూడా ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు