రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.