వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…