దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. తెలంగాణ మినమా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1520 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 1568 కేసులు, కర్ణాటకలో 1220 కేసులు నమోదయ్యాయి. అయితే, కేరళలో మాత్రం ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 29,322 కేసులు నమోదవ్వగా, 131 మరణాలు సంభవించాయి. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీ సంఖ్యలో నమోదవ్వగా, ఇప్పుడు ఆసంఖ్య…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1520 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. ఇందులో 19,89,931 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్చ్ కాగా 14,922 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు,…
ప్రపంచంలో మహమ్మారి కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ ద్వారా ప్రపంచంలోకి పేద, మద్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌లను అందిస్తోంది. అయితే, కోవాక్స్‌లో భాగంగా ఉత్తర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్తర కొరియా తిరస్కరించింది. తమకు ఆ వ్యాక్సిన్ డోసులు…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. ఇందులో 6,49,002 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,878 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా…
దేశంలో ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా అమలు జరుగుతున్నా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాల్లో మరలా ఆంక్షలు మొదలయ్యాయి. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాలు హెచ్చిరిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పటి వరకు కోలుకోలేదు. వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. ఆల్ఫా, బీటా, ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే, డెల్టా వేరియంట్‌లతో పాటుగా డెల్టా ప్లస్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా సి 1.2 వేరియంట్ కూడా వ్యాపిస్తున్నట్టు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇకపోతే, ఇప్పుడు ఎంయు అనే మరో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని…
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన…
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ… థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆంక్షలు మొదలయ్యాయి. కేరళలో నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై కర్నాటకలో క్వారంటైన్ ఆంక్షలు విధించారు. కేరళ నుంచి కర్నాటకకు వస్తే తప్పని సరిగా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇకపోతే,…
కరోనా కాలంలో అనేక మంది తమ విలువైన ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది రోడ్డున పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త వేరియంట్లతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. కరోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు లేకపోవడంతో పైలెట్‌లను తొలగించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యూకేకు చెందిన ఎరోల్ లెవెంథల్ కూడా ఒకరు. ఈయన ఉద్యోగం కోల్పోయిన తరువాత, పైలెట్ కాకముందు ఉన్న అనుభవంతో తిరిగి లారీ డ్రైవర్‌గా…