ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,28,795కి చేరింది. ఇందులో 19,99,651 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 15,157 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1090 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందినట్లు…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా…
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. నిన్నటి రోజున 43 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 43 వేల కేసుల్లో 30 వేలకు పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 180 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజధాని ముంబైని మళ్లీ కరోనా భయపెడుతున్నది. ముంబై నగరంలో నిన్నటి రోజున 500 లకు పైగా కేసులు నమోదయ్యాయి. జులై 15…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,58,843కి చేరింది. ఇందులో 3,22,24,937 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 3,92,864 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో మహమ్మారి నుంచి 42,942 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 290 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు…
మన పొరుగుదేశం చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా కరోనా పేరు చెబితినే ప్రపంచ దేశాలు వామ్మో అంటున్నాయి. అగ్ర దేశాలైతే కరోనా పేరుచెబితే హడలిపోతుండగా.. భారతీయులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కరోనాపై ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందో తెలియదుగానీ దాన్ని మరీ పుచికపుల్లలా తీసిపారేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు, పక్కనే ఉన్న భారత్ కు రావడానికి…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. డెల్టాతో పాటుగా డెల్టాప్లస్, ఏవై 11, ఏవై 12, ఏవై 13 వేరియంట్లు ఇండియాలో విస్తరిస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621కి చేరింది. ఇందులో 3,21,81,995 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా… 4,04,874 కేసులు…
దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు…
కేరళలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కట్టడి కోసం నైట్ కర్ఫ్యూను విధించినప్పటికీ కంట్రోల్ కావడంలేదు. ప్రతిరోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ ముఖ్యమంత్రి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజున రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కరోనా కట్టడిపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆదివారం రోజున లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో…
కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది. కంటికి కన్పించకుండా ఈ మహమ్మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కబలించేస్తోంది. ఈ వైరస్ దాటికి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మృత్యు అంచులదాకా వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే కన్పించింది. అక్టోబర్లో థర్డ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరోనా ఫస్ట్…
భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్ వేవ్ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్ కంట్రోల్‌లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ…