కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయం అగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి. దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. దీంతో మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు. లాలాజలంతో…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి…
ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగదారులతో కళకళలాడేవి. కానీ, ఈ ఏడాది గోల్డ్ షాపులు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. తెలంగాణలో ఉదయం పది గంటల వరకే షాపులకు అనుమతి ఉండటం, అటు ఆంధ్రప్రదేశ్‌లో మద్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచి ఉండటంతో వినియోగ దారులు పెద్దగా కొనుగోలు చేసేందుకు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా…
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులతో పాటు, మరోవైపు మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా రెండు వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కోన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో వీరికోసం మెడికల్ కాలేజీకలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్…
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచంలో 44 దేశాల్లో ఆ వేరియంట్ వ్యాప్తి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కోన్నది. మొదటి వేవ్ తరువాత ఉదాసీనతను ప్రదర్శించడం వలనే భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా మ్యూటేషన్‌లు ఏర్పడటానికి ఉదాసీనతే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ బి.1.617 వేరియంట్ అటు బ్రిటన్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియా తరువాత అత్యదిక ఇండియా…
2020 నుంచి దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు అనేక మార్లు వాయిదా వేస్తూ వచ్చాయి. కరోనా కంట్రోల్ లోకి రావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత వరసగా ఎన్నికలు జరిగాయి. మే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. బడ్జెట్ సమావేశాలను జూన్ 3 లోగా తప్పనిసరిగా…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఈనెల 13 వ తేదీన రంజాన్ కావడంతో రంజాన్ తరువాత నుంచి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే…