కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం దేశంలో జీరో కేసులు నమోదవుతున్నాయని న్యూజిలాండ్ దేశం సంబరాలు చేసుకున్నది. వేల మందితో కలిసి మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించారు. అయితే, అది కొంతకాలమే అని మరోమారు తేలిపోయింది. చాలా కాలం తరువాత రాజధాని ఆక్లాండ్‌లో కరోనా కేసు నమోదవ్వడంతో ఆ నగరంలో లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్ విధించినప్పటికీ ఆ నగరంలో కేసులు…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 417 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 35,909 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,11,924కి చేరగా, 3,81,947 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక భారత్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,31,642కి చేరింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే…
కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో తగ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతూ వైరస్ బలం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ తీసుకుంటున్నా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా ఎటాక్ అవుతుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కారణం అయింది. ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి.…
ఆక్స్‌ఫర్ట్-అస్త్రాజెనకా సంయుక్తంగా అభివృద్దిచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, జులై 1 వ తేదీ నుంచి ఈయూ గ్రీన్ పాస్‌లను జారీ చేయబోతున్నది. గ్రీన్ పాస్‌లకు అర్హత కలిగిన వాటిల్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరు లేకపోవడంతో సీరం సంస్థ షాక్ అయింది. దీంతో ఈయూలో ప్రయాణం చేసే భారతీయులకు గ్రీన్ పాస్ లభించే అవకాశం…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్‌మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
కరోనా నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను దేశాధ్యక్షుడిని నాకు ఈ రూల్స్ వర్తించవు అంటే కుదరదు. అధ్యక్షులైనా సరే నిబంధనలు పాటించకుంటే ఇదిగో ఇలా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి బ్రెజిల్ ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రజారోగ్యంపై దృష్టిసారించినప్పటికీ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో అభివృద్ధి ఆగిపోతుందనే పేరుతో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేయడంతో హడావుడిగా లాక్‌డౌన్ వంటివి చేసినప్పటికీ…
మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ…
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో…