కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్‌డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత…