కరోనా కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనాకు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ అనేక మ్యూటెంట్లుగా మార్పులు చెంది ప్రజల ప్రాణాలు హరింస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, సార్స్ కోవ్ 2 వైరస్‌లో ఉత్పరివర్తనాలు వేగంగా మార్పులు జరుగుతుండటంతో అన్నిరకాల వేరియంట్లను తట్టుకొని నిలబడటం కోసం మెడిసిన్‌ను రెడీ చేస్తున్నట్టు అమెరికాలోని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు పేర్కోన్నారు. కరోనాను కట్టడి చేయడానికి యాంటివైరల్‌ను అభివృద్ది చేయడం అత్యవసరంగా…
తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో లాక్ డౌన్ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్‌డౌన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
కరోనా మహమ్మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా సోకిన వారి కంటే, ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి నిద్రకు దూరమైన వ్యక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు కూడా సామాజికంగా దూరాన్ని పాటించాల్సి రావడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. అయితే తాజాగా ప్రసిద్ది గాంచిన మేడారంకు కరోనా సెగ తగిలింది. ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క తల్లి పూజారి అయిన…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. మహమ్మారి మొదటి వేవ్‌ను దాదాపుగా అన్ని దేశాలు లైట్‌గా తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అటు బ్రిటన్ కూడా ఈ మహమ్మారిని లైట్‌గా తీసుకున్నది. ప్రజల్లో భయాంధోళనలు కలిగించకూడదనే ఉద్దేశ్యంతో బ్రిటన్ ప్రధాని లైవ్‌లో కరోనా వైరస్‌ను ఎక్కించుకుంటానని ఆయన సన్నిహితులతో చెప్పారట. ఈ విషయాన్ని ఎయిడ్ డొమినిక్ కమ్మిన్స్ బయటపెట్టారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ అలా చెప్పినట్టు…
తెలంగాణలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. 10 గంటల నుంచి తిరిగి తెల్లవారి 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ సమయం ముగుస్తుంది. మే 30 తరువాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విషయంపై ఈ నెల…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహలు కారణం అని ప్రపంచం భావిస్తోంది. ఆ గుహల నుంచి వైరస్ ఊహాన్‌కు అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించినట్టు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యునాన్‌లో ఉన్న గుహలను పూర్తిస్థాయి భద్రత కల్పించిది చైనా. ఎవరిని అటువైపు వెళ్లనివ్వడంలేదు. చైనా అద్యక్షుడి అనుమతి ఉన్న పరిశోధకులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇక చైనా పరిశోధకులు…
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని నిపుణులు ముందస్తుగా హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాలు ఆ ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పిల్లలపై ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. ఇందులో 13,61,464 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,09,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 104 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,126కి చేరింది. అనంతపురంలో 1846,…
కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయం అగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి. దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. దీంతో మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు. లాలాజలంతో…