తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సినిమా థియోటర్లతో సహా అన్ని ప్రారంభమయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406 కి చేరింది. ఇందులో 6,32,728 మంది కోలుకొని డిశ్చార్జ్…
తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read: జగన్…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 30 వేల నుంచి 40 వేల వరకూ నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్లోకి వచ్చినా, కేరళ రాష్ట్రంలో మాత్రం అదుపులోకి రావడంలేదు. పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పాజిటివిటీ శాతం 5 శాతం కంటే తక్కువుగా నమోదవుతుంటే, కేరళలో మాత్రం 10 నుంచి 15 శాతం వరకు నమోదవుతుండటం…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే 45 కోట్లకు పైగా టీకాలు వేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ మందకోడిగా జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. గతంలో చెప్పిన విధంగానే జులై 31 నాటికి ఎట్టిపరిస్థితుల్లో కూడా 51 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 45.7 కోట్ల డోసులు…
ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి అనేక దేశాల్లో కరోనా తిరిగి విజృభిస్తున్నది. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటికీ ఆ దేశంలో వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.…
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1843 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది. ఇందులో 19,11,812 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,209 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 70,727 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో…
చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు తగ్గినట్టుగానే తగ్గి మరలా అధిక సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై కరోనా విజృభిస్తున్నది. వీరికి కరోనా సోకితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మధుమేహం బాధితులకు కరోనా సోకితే ముప్పు…
కరోనా కేసులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్నా, మరికొన్ని చోట్ల భారీగా నమోదవుతున్నాయి. వివిధ దేశాల్లో వివిధ రకాలైన వేరియంట్లు నమోదవుతున్నసంగతి తెలిసిందే. ఆల్పా, బీటా, గామా వేరియంట్లు నమోదైనా వీటిలో ఆల్ఫా వేరియంట్ కేసులు అత్యధికం. అయితే, ఇండియాలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్లు ఆల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. డెల్టా వేరియంట్ కారణంగా ఇండియాలో రోజూ వేలాది కేసులు, మరణాలు సంభవించాయి. ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని…