అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశ దేశాల్లో భయానక వాతావరణాన్ని కరోనా మహమ్మారి సృష్టించింది. కరోనాతో ప్రత్యక్షంగా కొంతమంది దెబ్బతింటే.. మరి కొంత మంది పరోక్షంగా దెబ్బతిన్నారు. మొత్తానికి కరోనా వైరస్ దెబ్బకు మానవుల జీవితాలలో కరోనా కాలాన్ని ఒక విషాద సమయంగా అభివర్ణిస్తున్నారు. అయితే.. అయితే కరోనా వైరస్ సోకిన వారిపై తాజాగా చేసిన పరిశోధనల్లో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పనితీరు మార్పులు…