దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,00,632 మంది సాంపిల్స్ పరీక్షించగా… కొత్తగా 704 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక,…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. రోజుకు 40 లక్షల వరకు టీకాలు వేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ చివరినాటికి దేశంలోని 18 ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ప్రతిరోజు 80 లక్షల వరకు టీకాలు అందించాలి. Read: ‘భాయ్ జాన్’పై…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 సాంపిల్స్ పరీక్షించగా… 2,982 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,461 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213కు చేరుకోగా… రికవరీ కేసులు 18,69,417కు పెరిగింది.. ఇక, ఇప్పటి…
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వలనే కరోనా రక్కసి కోరల నుంచి దేశాలు బయటపడుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్‌డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. Read: బన్నీకి…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్‌తీసుకోవడం వలన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే కనీపం ఆరునెలలపాటు యాంటీబాడీలో శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కానీ, చాలామంది అపోహల కారణంగా, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుందో అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. కానీ, టీకాలు తీసుకోక పోవడం వలన వారికే కాకుండా వారి చుట్టు ఉన్న వారికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని…
కరోనా కేసులు తగ్గుతున్నా ముప్పు మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. ముప్పు ప్రమాదం ఇంకా పొంచి ఉన్నది. దీంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నైకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి చెన్నై మునిపల్ కార్పోరేషన్‌తో కలిసి వినూత్నంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల, భయాన్ని అపోహలు తొలగించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆటోలో ప్రయాణం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అయితే, మాములుగా ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే ఎవరు పట్టించుకుంటారు. అందుకే…
కరోనా మహమ్మారి దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలి వేవ్ ను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన కేరళలో సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. కేరళతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గడ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి…