తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,730 శాంపిల్స్ పరీక్షించగా… 203 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 160 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,341కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,488కు పెరిగింది. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 122 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,73,852కి చేరింది. నిన్న కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 14,453కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 213 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 20,57,369 మంది కరోనా నుంచి కోలుకుని…
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మార్చి నుండి…
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరయింట్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 72 గంటల్లో తెలంగాణ, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వంద మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కళాశాలలో జరిగిన వేడుకల తరువాత కేసులు బయటపడ్డాయి. దీంతో…
కరీంనగర్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్‌కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్‌ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,693 శాంపిల్స్ పరీక్షించగా… 156 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 147 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,157కు పెరిగింది. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,263 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 159 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 169 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,75,940 కు చేరింది.. మొత్తం…
సంగారెడ్డి జిల్లాపై కరోనా పడగ విప్పిందా? చిన్నపాటి నిర్లక్ష్యం విద్యార్ధులు, విద్యార్ధినుల పాలిట శాపంగా మారిందా? గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు అంత సేఫ్ కాదా? అంటే అవుననే అంటున్నారు. హైదరాబాద్‌ను ఆనుకుని వున్న సంగారెడ్డి జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా ఇంద్రేశంలో కేసులు బయటపడడం ఆందోళనకరంగా మారింది.తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. READ ALSO కరోనా సోకిన బాలికల్లో 25…
కరోనా ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తే, ఒమిక్రాన్ అంతకు మించి కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే 29 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. నిన్న యూఎస్‌లో ఒక కేసు నమోదవ్వగా, ఈరోజు ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 379 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు…
కరోనా మహహ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా ధాటికి ఎన్నో దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకువచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ కూడా ఎంతో వేగవంతంగా సాగుతోంది. అయినా కూడా కరోనా మహహ్మరి రూపాలు మార్చుకోని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో తలమునకలవుతోన్న వేళ మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు…