కరోనా ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తే, ఒమిక్రాన్ అంతకు మించి కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే 29 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. నిన్న యూఎస్‌లో ఒక కేసు నమోదవ్వగా, ఈరోజు ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 379 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు భారత ఆరోగ్యశాఖ తెలియజేసింది.
Read: కరోనా ఎఫెక్ట్: యూరప్ అల్లకల్లోలం…భారీగా నమోదవుతున్న కేసులు…
రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసిన తరువాతనే బయటకు పంపుతున్నారు. నవంబర్ 11 వ తేదీన బోట్స్‌వానాలో మొదటగా ఒమిక్రాన్‌ను గుర్తించగా, సౌతాఫ్రికాలో మొదటికేసు బయటపడింది. ఆ తరువాత క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ విస్తరిస్తుండం, యూరప్ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రపంచం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.