కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్‌లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు. ఈ కాలర్ ట్యూన్ కారణంగా…