Global Warming: భూమి గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాగే పెరుగుతూ వెళ్లే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. రికార్డ్ స్థాయిలో గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు, పెరుగుతున్న గ్లోబర్ వార్మింగ్ పెరుగుతున్నాయని 50 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు గురువారం క్లైమేట్ సైన్స్ అప్డేట్ లో హెచ్చరించారు. 2013 నుండి 2022 వరకు పరిశీలిస్తే మానవ ప్రేరితంగా భూమి వేడెక్కడం దశాబ్ధానికి 0.2 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ రేటుతో పెరుగుతోందని పీర్-రివ్యూ చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు నివేదించారు.
అదే సమయంలో సగటు వార్షిక ఉద్గారాలు ఆల్ టైమ్ గరిష్టస్థాయి 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్(CO2), అంటే ప్రతీ సెకన్ కు 1,700 టన్నులు CO2 విడుదల అవుతోంది. ఈ సంవత్సరం చివర్లో దుబాయ్‌లో జరిగే కీలకమైన COP28 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకుల ముందుకు ఈ కొత్త డేటా రాబోతోంది. యూఎన్ చర్చలలో ‘‘గ్లోబల్ స్టాక్‌టేక్’’ 2015 పారిస్ ఒప్పందం లక్ష్యాల పురోగతిని చర్చించనున్నారు. పారిస్ ఒప్పందంలో గ్లోబర్ వార్మింగ్‌ను అరికట్టడానికి నిర్ధేశించుకున్న విధంగా 1.5 సెల్సియస్ ఉష్ణోగ్రత పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నామని, అయితే ఇది ఇలాగే కొనసాగితే మానవాళి ఈ పరిమితిని మించే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన పియర్స్ ఫోర్స్టర్ తెలిపారు.
Read Also: Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
UN క్లైమేట్ సైన్స్ అడ్వైజరీ బాడీ, ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని తెలిపింది. శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా ఎక్కువగా ఉత్పన్నమయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఇతర వార్మింగ్ ఉద్గారాలు 1.5C థ్రెషోల్డ్‌లో ఉండాలంటే కర్భన ఉద్గారాలు 250 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదని శాస్త్రవేత్తలు తెలిపారు. పారిస్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలంటే 2030 నాటికి CO2 కాలుష్యాన్ని కనీసం 40 శాతం తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతోంది.
ప్రస్తుతం మనం బొగ్గు, పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే అన్ని మౌళిక సదుపాయాలను ఇలాగే కొనసాగిస్తే భూమి కనీసం 2 డిగ్రీల సెల్సియస్ వేడెక్కుతుందని UN నేతృత్వంలోని IPCC సూచించినట్లు నివేదిక పేర్కొంది. 2000 నుంచి మహాసముద్రాలు మినహాయించి, భూభాగాలపై అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుదలలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మానవ కార్యకలాపాలు గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలకు కారణం అవుతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు 1850-1900తో పోలిస్తే 2011-2020లో 1.1 డిగ్రీ సెల్సియస్ కి పెరిగింది.