ఓరుగల్లుకు ఓ చరిత్ర ఉందని, విజ్ఞాన ఖనిగా ఓరుగల్లుకి పేరుందని.. ఆ పేరు నిలబెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల దావోస్ టూర్ వెళ్లిన ఆయన త్వరలో పారిస్ వెళ్లబోతున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ…
తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,544 మందికి బీఎస్సీ, 328 మంది పీజీ, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పట్టాలను అందజేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రకటించారు. ఎన్.వి.రెడ్డి, ఎ.కె.సింగ్, ఆలపాటి సత్యనారాయణలకు జాతీయ…
రేపు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరగనుంది. హైదరాబాద్ తో పాటు మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా మేనేజ్ మెంట్ శిక్షణ అందించే అత్యున్నత స్థాయి బిజినెస్ స్కూల్. దీంతో హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాలగా పేరు పొందింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థినీ, విద్యార్ధులకు అంతర్జాతీయ సంస్థల్లో…