రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనేట్లు NREGS పథకాన్ని అమలు చేస్తే రైతులు బ్రతకరు అన్నారు ధర్మాన. ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయి. రెండు గంటలు పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు ? ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ. రైతులకు ఏమైనా ఫర్వాలేదనే…
న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు… గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు…