Contract Lecturers: తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌ను ముట్టడించారు. మొత్తం 12 విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,400 మంది కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సామర్ల విజయేందర్ రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ…
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు…
అమరావతి : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది ఏపీ ప్రభుత్వం. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల…