Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని…