Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మధ్యాహనం 3.30 గంటలకి డిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.
Waqf Bill: బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘‘వక్ఫ్ బిల్లు’’పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, మైనారిటీలను చెడుగా చూపిస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు.
Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల…
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని…
Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు బీదర్‌లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ముద్రించిన నకిలీ నోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అప్పులపాలైందని, ప్రస్తుతం రాష్ట్రంపై రూ.6…
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..
MP K. Laxman : తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వేర్వేరు పార్టీలు అన్న ప్రచారం ప్రజలను మోసగించేందుకు మాత్రమేనని, వాస్తవానికి ఈ రెండు పార్టీలకు నడివీధిలో సంబంధం ఉన్నట్టే కాంగ్రెసే భవిష్యత్‌గా ఎదిగేందుకు బీఆర్ఎస్ తో చేతులు కలిపిందని అన్నారు. తమిళనాడు…
Kishan Reddy : ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ…
Etela Rajender : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) , కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ఈ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు అని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అనేక సమావేశాలు నిర్వహించడం వెనుక వైఫల్యాలను దాచిపెట్టే ఉద్దేశమే ఉందని ఈటల అన్నారు. హైదరాబాద్‌లో ఒకటి కాదు, ఏకంగా 50 మీటింగ్‌లు పెట్టినా,…