Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు ‘సీ’లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.. నేడు వ్యవసాయ మంత్రిగా ఉన్నపుడు రైతు సంఘాలతో చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు.. బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ రూ. 1860 ఉంటే రూ.600కి తగ్గించామని.. ఆ నిర్ణయంతో బీటీ విత్తనాలపై రూ.60 వేల కోట్లు రైతులకు ఆదా అయినట్టు వెల్లడించారు.. రైతుల విషయంలో కమ్యూనిస్టుల ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన ఒకటే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి..
Read Also: Kasireddy Rajasekhar Reddy: హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురు!
మరోవైపు.. దేశాన్ని కాపాడే శక్తి అవునన్నా కాదన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులకే ఉంది అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రధాని మోడీ నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్లు అయ్యింది.. కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్లు అయ్యింది.. కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఒక్కరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా..? ఉద్యమాలు చేసారా..? ప్రాణత్యాగం చేశారా..? అని ప్రశ్నించారు.. దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్ పార్టీలు అన్ని కలవాలి, పోరాడాలని పిలుపునిచ్చారు.. ఇక, గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ఆ సీట్లు వచ్చింటే రాజ్యాంగం వచ్చిందేది కాదు అన్నారు.. అందరూ కలసి బతుకుతున్నామంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణంగా చెప్పుకొచ్చారు రామకృష్ణ..