ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త…
రాజకీయంగా పోటీని తట్టుకోలేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం సహజమేనని దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు… అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయినందువల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు. అదే విధంగాతన నియోజకవర్గానికి చెందిన కరకగూడెం…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుండి వచ్చి చేరే వారీ సంఖ్య పెరుగుతుంది. అధికార పార్టీ నుండి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొత్తగా వచ్చి చేరిన నల్లాల ఓదెలు అయినా… తాజాగా PJR కూతురు విజయారెడ్డి అయినా .. భవిష్యత్ రాజకీయానికి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారు. ఓదెలుకి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్‌కి పెద్దగా కష్టం లేదు. కానీ సమస్య అంతా విజయారెడ్డి గురించే. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో.. ఒక కుటుంబానికి ఒకటే సీటు అని.. ఒకవేళ…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం…
నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని…