తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…