Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది.