ఖానాపూర్ కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్ గుదిబండగా మారబోతుందా ? పార్టీ నేతల్లో టికెట్ల పంచాయితీ అప్పుడే మొదలైందా? ఢిల్లీ చుట్టూ నేతలు ప్రదక్షిణలు మొదలు పెట్టారా ? ఖానాపూర్‌లో ఆదివాసీ, లంబాడాల ఆధిపత్యపోరు..! నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత రమేష్‌రాథోడ్ కమలం కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు ఖానాపూర్ కాంగ్రెస్‌లో పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలు, లంబాడాల ఆధిపత్య పోరు…
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌కు చీఫ్. అక్కడ పార్టీకి పెద్ద అయినా.. కేడర్‌తో అంతులేని గ్యాప్ ఉందట. ఇప్పుడు అది కాస్తా ఓపెన్ అయిపోయింది. నేరుగా పీసీసీ చీఫ్‌కే ఫిర్యాదులు చేసేవరకు వెళ్లిందట. దీంతో పార్టీవర్గాల్లో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై వ్యతిరేకవర్గం గుర్రు! తూముకుంట నర్సారెడ్డి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి కాంగ్రెస్…
ఒకే పార్టీలో ఉన్నారు.. ఒకే జిల్లా నాయకులు. కానీ.. నేతలిద్దరూ తూర్పు-పడమర. మాట మాట్లాడితే ఉప్పు-నిప్పులా ఉంటుంది యవ్వారం. ఆధిపత్యం కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న సమయంలో కొత్త రగడ తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ నేతల మధ్య పాత పగలు.. సెగలు రాజేసిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ చిచ్చు పెట్టడంతో పార్టీలో అందరి దృష్టీ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి..…