కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
Indira Bhawan : దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా 24, అక్బర్ రోడ్డు. కానీ ఇప్పుడు పార్టీ కొత్త స్థానం న్యూఢిల్లీలోని కోట్ల రోడ్‌లోని 9A వద్ద ఉంటుంది.
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం బిగ్‌బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లానని ఆమె తెలిపారు. వారిని అభినందించడానికే అక్కడికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగినట్లు…
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే,…