కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్‌గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఠాగూర్, రేవంత్‌ల…