West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత.
Punjab: ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో సోమవారం స్థానికి కాంగ్రెస్ నాయకుడిని తన నివాసంలో కాల్చి చంపారు. బల్జీందర్ సింగ్ బల్లి అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం దాలా గ్రామంలోని బల్లి నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇతను అజిత్వాల్ లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.