కొమురం భీం జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళ్తుంతోదన్న భయాలు పెరుగుతున్నాయి. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును తొలగించి ఆత్రం సుగుణకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం.
Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూ స్టార్‌పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు…